News December 23, 2025

తిరుపతి ప్రజలకు గమనిక

image

తిరుపతి జిల్లాలో ఆసక్తి ఉన్నవాళ్లు ‘యువ ఆపద మిత్ర’కు దరఖాస్తు చేసుకోవాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి జి.విజయ్ కుమార్ కోరారు. 18 నుంచి 40ఏళ్ల లోపు అర్హులని చెప్పారు. ఈనెల 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ పొందిన వారు జిల్లాలో ఏవైనా విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

Similar News

News December 26, 2025

నాగర్ కర్నూల్: కవిత పర్యటన వివరాలు

image

ఎమ్మెల్సీ కవిత శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు పంప్ హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు పెంట్లవెల్లిలో రుణమాఫీ కాని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మెడికల్ కాలేజ్, వట్టెం రిజర్వాయర్, సిర్సవాడ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

News December 26, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. డే విజన్, నైట్ విజన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మద్యపానం, గంజాయి విక్రయాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ డ్రోన్ల వినియోగం ఎంతో కీలకంగా మారుతుందని ఆయన వివరించారు.

News December 26, 2025

APPLY NOW: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్/ మెకానికల్/ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/