News December 23, 2025
‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు’

కామారెడ్డిలోని DM&HO కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి అడ్వైజరీ పీసీపీఎన్‌డీటీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి విద్య మాట్లాడుతూ.. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను పీఓలు, డిప్యూటీ డిఎం&హెచ్‌ఓలు నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఓ డాక్టర్ హేమీమా, గైనకాలజిస్ట్ దివ్య తదితరులు ఉన్నారు.
Similar News
News December 27, 2025
ధనుర్మాసం: పన్నెండో రోజు కీర్తన

‘లేగదూడలను తలచుకొని గేదెలు కురిపించే పాలధారలతో వాకిళ్లన్నీ తడిసిపోతున్నాయి. ఇంతటి ఐశ్వర్యం కలిగిన గోపాలుని సోదరీ! బయట మంచు కురుస్తున్నా, మేమంతా వేచి ఉన్నాము. శ్రీరాముడు ఆనాడు రావణుడిని సంహరించిన వీరగాథలను మేమంతా భక్తితో పాడుతున్నాము. ఇంత జరుగుతున్నా నీవు మాత్రం నిద్ర వీడటం లేదు. నీ భక్తి పారవశ్యం మాకు అర్థమైంది. ఇకనైనా ఆ నిద్ర చాలించి, మాతో కలిసి ఆ మాధవుని సేవలో పాల్గొనవమ్మా!’ <<-se>>#DHANURMASAM<<>>
News December 27, 2025
ఖమ్మం: సొంత పార్టీ నేతలపైనే ‘హస్తం’ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి వర్గాలకు సహకరించారని వారిపై పలువురు MLAలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే MLAలు మట్టా రాగమయి దయానంద్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ MLA పొదెం వీరయ్య బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే అంశాన్ని CM, Dy.CM దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 27, 2025
H1B వీసా జాప్యాన్ని US దృష్టికి తీసుకెళ్లిన భారత్

H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్‌మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్‌లో ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.


