News December 23, 2025

సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలి: ఎస్పీ

image

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

Similar News

News December 30, 2025

అవార్డ్ అందుకున్న ధర్మారం యువకుడు

image

ధర్మారం మండలానికి చెందిన కోలిపాక కుమారస్వామి తన జీరో బడ్జెట్‌తో “కళాకారుడు” అనే షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌ మేకర్స్ ఛాలెంజ్-2025 అవార్డు అందుకున్నారు. 3 నిమిషాల చిత్రాన్ని 15 రోజుల్లో పూర్తిచేసి 500కుపైగా చిన్న సినిమాలను పోటీలో అధిగమించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, TGFDC ఛైర్మన్ దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు కుమారస్వామిని అభినందించారు.

News December 30, 2025

భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌

image

యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ నియమితులయ్యారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్‌ను ప్రత్యేక పోలీస్ జిల్లాగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న అక్షాంశ్ యాదవ్‌నే ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది.

News December 30, 2025

సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

image

AP: న్యూఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్లకు పర్మిట్ లైసెన్సులు ఉన్న వారికి రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా రాకుండా అధికారిక పనివేళలు పెంచినట్లు తెలిపింది.