News December 23, 2025
పర్యాటక హబ్‌గా నంద్యాల జిల్లా: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 3, 2026
నర్సంపేట: లేగ దూడకు శాస్త్రోక్తంగా నామకరణం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లి గ్రామంలో లేగ దూడకు శాస్త్రోక్తంగా నామకరణం చేశారు. గ్రామానికి చెందిన పెండ్యాల విజయ- సురేందర్ దంపతులు కొన్నేళ్ల క్రితం ఒక ఆవును తెచ్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ ఆవుకు సీమంతం కూడా చేశారు. ఇప్పుడు ఆ ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. శుక్రవారం గ్రామస్థుల సమక్షంలో ‘నందీశ్వర’ అని పేరు పెట్టారు.
News January 3, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 3, 2026
మీ రికార్డులు మాకు తెలుసులే.. ట్రంప్‌పై ఇరాన్ సెటైర్లు

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<18742175>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ సెటైర్లు వేసింది. ‘ట్రంప్ అడ్వెంచరిజంలో మునిగిపోయారు. అయినా మీ రెస్క్యూ రికార్డు గురించి మాకు తెలియదా. ఇరాక్, అఫ్గాన్, గాజాల్లో మీరు ఏం చేశారో ఇరానియన్లకు తెలుసు’ అని ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఎద్దేవా చేశారు. ఇరాక్, అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలను అర్ధంతరంగా విత్ డ్రా చేసుకోవడాన్ని గుర్తుచేశారు.


