News December 23, 2025

రాజమండ్రి: రౌడీ షీటర్లకు ఎస్పీ ప్రత్యేక కౌన్సెలింగ్

image

రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు మంగళవారం 6 గంటల పాటు నిరంతరాయంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహా కిషోర్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. అవసరమైతే నగర బహిష్కరణ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.

Similar News

News January 12, 2026

తూ.గో: అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు

image

కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిడదవోలు(M) అట్లపాడులో బండి కోట సత్యనారాయణ(28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి దుర్గ భవాని ఉన్నారు. సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

News January 12, 2026

తూ.గో: ఇనుపరాడ్‌తో కొట్టి భార్యను హతమార్చిన భర్త

image

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్‌తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వీరయ్యగౌడ్‌ వెల్లడించారు.

News January 12, 2026

తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

image

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలన్నారు.