News December 24, 2025

కోట్ని బాలాజీకి TDP అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడింది ఎవరు?

image

DCMS ఛైర్మన్‌గా ఉన్న బాలాజీకి అనకాపల్లి జిల్లా TDP అధ్యక్షుడి పదవి దాదాపు ఖరారైనా.. ఆఖరి నిమిషంలో చేజారింది. అధ్యక్ష పదవి కాపు వర్గానికి ఇవ్వాలని డిసైడ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలందరి మద్దతుతో పాటు మంత్రి లోకేశ్ అండదండలు ఉండటంతో బాలాజీ పేరు దాదాపు ఖరారైంది. అయితే జిల్లాకు చెందిన మాజీ MLA, అత్యంత సీనియర్ నాయకుడు బాలాజీ స్థానంలో మరొకరికి ఇవ్వలని చెప్పడంతో బత్తులకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News December 31, 2025

నెల్లూరు: సాగులో సమస్యలా.. ఈ నంబర్లకు కాల్ చేయండి

image

జిల్లాలో సాగు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి.. ఏ మందులు వాడాలి.. సస్యరక్షణ చర్యలు ఏంటి.. ఎరువులు ఏ మొతాదులో వేయాలి.. వంటి సమస్యలకు వ్యవసాయశాఖ కొన్ని ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకోచ్చింది.
-వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు : 0861-2327803, 9490327424
-వేరుశనగ : 9440566582
-ఉద్యాన, వ్యవసాయ పంటలు(తెగుళ్లు : 0861-2349356, 9490004254
– ఉద్యానపంటలు: 7995088181 (ఉద్యాన శాఖ )

News December 31, 2025

తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు

image

ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తాత్కాలిక అనౌన్సర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కనీసం ఏదైనా డిగ్రీతోపాటు స్వర మాధుర్యం, ఉచ్చారణలో స్పష్టత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 21-50 ఏళ్ల మధ్య వారు అర్హులు. రాత పరీక్ష, స్వర పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 15వ తేదీలోగా ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి చిరునామాకు పంపించాలి.

News December 31, 2025

సాయిద సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

సాయుధ పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు నిజాయితీని కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా పోలీసు సాయుధ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కిట్లను, కార్యాలయ రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.