News December 24, 2025
జగిత్యాల: ‘పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?’

జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి యావర్ రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను తీవ్రంగా విమర్శించారు. 2017లోనే 100 ఫీట్ల విస్తరణకు నివేదిక పంపినా, ఎన్నికల లబ్ధి కోసం పనులు అడ్డుకున్నారని ఆరోపించారు. 2021లో జీఓ 94 వచ్చినా అమలు చేయలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి విస్తరణ చేయకపోవడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 12, 2026
విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
సంక్రాంతి.. HYD దాటిన 7 లక్షల వాహనాలు

సంక్రాంతి వేళ HYD నుంచి స్వగ్రామాలకు జనం క్యూ కట్టారు. ఈ సారి 12 లక్షల వాహనాలు HYD దాటనున్నట్లు అంచనా వేయగా.. ఇప్పటికే సుమారు 7 లక్షల వాహనాలు HYD దాటినట్లు వివిధ శాఖల అధికారులు తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్, ఆగిన వాహనాల తరలింపునకు క్రేన్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి.
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్‌గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.


