News December 24, 2025

ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 14, 2026

‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

image

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

News January 14, 2026

ప.గో: ‘బరి’లో సస్పెన్స్.. పైచేయి ఖాకీదా? ఖద్దరుదా?

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అయితే, ఈ ఏడాది భోగి రోజున ఉదయం 10:40 గంటలు కాస్తున్నా, పందాలకు అనుమతులు లభించలేదు. దీంతో పందెం రాయుళ్లు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పైచేయి ఖాకీదా ? ఖద్దరుదా ? తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం(M) కడియద్ద, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, తాడేపల్లిగూడెంలోని బరులను ధ్వంసం చేశారు.

News January 14, 2026

ప.గో జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

సంక్రాంతి పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మి హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలను నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలు చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.