News April 22, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు YCP,TDP ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి మనోహర్ నాయుడు, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత ఉన్నారు. ప్రత్తిపాడు టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, తూర్పు మహ్మద్ నజీర్, గురజాల యరపతినేని శ్రీనివాసురావు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు నామినేషన్ వేయనున్నారు.

Similar News

News March 20, 2026

ANUలో BFA 1వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BFA 1వ సెమిస్టర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 17 మందిలో 16 మంది ఉత్తీర్ణులు (94.12%) సాధించారు. రీవ్యాల్యూయేషన్‌కు మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, మార్చి 31లోపు పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలని పరీక్షల కార్యనిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాద్ రావు తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ. 2070, పర్సనల్ వెరిఫికేషన్ రూ.2190 గా వుందని వెల్లడించారు.

News March 20, 2026

GNT: పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం గ్రీవెన్స్ జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ సమస్యలు తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని అన్నారు.

News March 20, 2026

GNT: చిన్న శివలింగం వెనుక పెద్ద కథ.. లోకేశ్ వివరణ

image

పూజ గదిలో ఉన్న బొమ్మలపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ Xలో స్పందించారు. నాలుగేళ్ల వయసులో తన కుమారుడు దేవాన్ష్ తయారు చేసిన శివుడి బొమ్మ, చిన్న శివలింగాన్ని జ్ఞాపకంగా పూజా గదిలో ఉంచినట్లు తెలిపారు. చిన్న వయసులోనే శివ భక్తుడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. భక్తి అనేది కొందరికి అర్థమవుతుందని, మరికొందరికి కాదని, అలాంటి భక్తికి వివరణ అవసరం లేదని పేర్కొన్నారు.