News April 22, 2024
ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ రోడ్ షో : వెంకట్రామిరెడ్డి

మెదక్ పార్లమెంట్ పరిధిలో మే 7, 8, 10 తేదీల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆదివారం తెలిపారు. 7న రాత్రి 7 గంటలకు మెదక్, 8న సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్, 7 గంటలకు పటాన్‌చెరు, 10న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేటలో కేసీఆర్‌తో రోడ్ షో ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News September 11, 2025
బీఆర్ఎస్వీ నాయకులను వెంటనే విడుదల చేయాలి: హరీశ్‌రావు

గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులు, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News September 11, 2025
మెదక్: మొత్తం ఓటర్లు= 5,23,327 మంది

మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్క తేలింది. బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రకటించారు. 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలుండగా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 2,51,532 మంది పురుషులు, 2,71,787 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని వివరించారు.
News September 11, 2025
మెదక్: బోధనా నాణ్యత పెరగాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి FLN, TLM బోధన అభ్యసన మేళాను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసమే బోధన అభ్యసన మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేళాలో 21 మండలాల నుంచి 1-5 తరగతుల ఉపాధ్యాయులు పాల్గొనగా ఎనిమిది మంది టీచర్స్ రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యారు.