News April 22, 2024
ఒంటిమిట్ట: వాహనాల దారి మళ్లింపు వివరాలు

సోమవారం ఒంటిమిట్టలో శ్రీరాముని కళ్యాణం సందర్భంగా అధికారులు వాహనాల దారి మళ్లింపు వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు రాయచోటి మీదుగా, తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి దారి మళ్లించామన్నారు. రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా, రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ మీదగా వెళ్లాలన్నారు.
Similar News
News March 12, 2026
కడప: 10th పరీక్షలు.. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఇవే.!

కడప: ఈనెల 16నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 28,152 మంది విద్యార్థులు 10th పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ 27,731, ప్రైవేట్ 421మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు 14,486, బాలికలు 13,666 మంది ఉన్నారు. వీరి కోసం 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కందిమల్లాయపల్లె, కమలాపురం, వేంపల్లె, మైదుకూరు, వల్లూరు, ఎగువపేట పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
News March 12, 2026
రేపు కడపకు రానున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 13న కడపకు రానున్నారు. YVU జరగనున్న స్నాతకోత్సవానికి ఆయన ఛాన్స్‌లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి కార్యక్రమం జరిగే వేదిక చేరుకొంటారు. అనంతరం తిరిగి ఆయన విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 12, 2026
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కడప ఎస్పీ

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.


