News April 22, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు YELLOW ALERT

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నుంచి నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Similar News
News July 10, 2025
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన: ADB SP

బాలలు బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని, పిల్లలు కార్మికులుగా ఉండరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన పది రోజుల వ్యవధిలో 37 మంది బాలల సంరక్షణ తోపాటు జిల్లావ్యాప్తంగా 10 కేసుల నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
News July 10, 2025
ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
News July 10, 2025
రుయ్యాడి పీర్ల బంగ్లా ఆదాయం ఎంతంటే..?

తలమడుగు మండలం రుయ్యాడి హస్సేన్, హుస్సేన్ దేవస్థానంలో సవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ లెక్కింపును బుధవారం చేపట్టారు. దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగింది. నగదు రూపంలో రూ.14 లక్షలు,10 తులాల బంగారం, 1.25 కేజీల వెండి వచ్చినట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.