News April 22, 2024
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

పట్టణంలోని కొర్లగుంటకు చెందిన మురుగేశ్ కుమారుడు చరణ్ (15) ఇటీవలే పది పరీక్షలు రాశాడు. ఇంటి నుంచి స్కూటీ తీసుకుని బయటకు వచ్చాడు. సుబ్బారెడ్డి నగర్ వద్దనున్న శ్రీనివాస సేతుపై వందడుగుల దూరం వెళ్లగానే అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు గుర్తించి 108 లో రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 3, 2026
చిత్తూరు: నిరుపయోగంగా నీటి తొట్టెలు

వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలను ఉపాధి హామీ పథకంలో నిర్మించారు. జిల్లాలో రూ. 2.71 కోట్ల వ్యయంతో 776 నీటి తొట్టెలను నిర్మించారు. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అధికారులు వీటిలో నీటిని నింపేలా చర్యలు చేపడితే.. వేసవిలో పశువులకు నీటి కొరత ఉండదని పాడి రైతులు తెలుపుతున్నారు.
News March 3, 2026
TPT: 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TTD ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) హాస్పిటల్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TTD ప్రకటనలో పేర్కొంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ మొదలైన 9 విభాగాలలో మొత్తం 30 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 13.
News March 3, 2026
చిత్తూరు: ప్రియురాలిపై అనుమానంతో సూసైడ్

ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్వేటినగరంలో జరిగింది. పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (35) ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆ మహిళపై అనుమానంతో కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


