News December 24, 2025

సిద్దిపేట: ‘రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు’

image

సురక్ష బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పుల్లూరు మేనేజర్ ప్రదీప్ చెప్పారు. జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.436 చెల్లిస్తే జీవిత బీమా రూ.2 లక్షలు వర్తిస్తుందని తెలిపారు. రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని బస్టాండ్‌లో జాగృతి ఫౌండేషన్ విజయవాడ ఉమాశంకర్ కళాజాత బృంద సభ్యులు ఆర్థిక, డిజిటల్ పై అవగాహన కల్పించారు.

Similar News

News December 25, 2025

రేపు బాక్సింగ్ డే.. సెలవు

image

రేపు (డిసెంబర్ 26) బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే ఉంది. కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.

News December 25, 2025

FLASH: నార్కట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఛిద్రమైన శరీరం..!

image

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లూనాపై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను ఒక చోటికి చేర్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 25, 2025

శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

image

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.