News December 24, 2025

నూతన పెన్షన్లపై అనంతపురం కలెక్టర్ కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.

Similar News

News December 25, 2025

ఇకపై ‘కామెలియా సినెన్సిస్’ ఆకులతో చేసేదే టీ!

image

కేవలం ‘కామెలియా సినెన్సిస్’ (టీ మొక్క శాస్త్రీయ నామం) ఆకులతో చేసే డ్రింక్‌ను మాత్రమే ‘Tea’ అనాలని FSSAI స్పష్టం చేసింది. హెర్బల్ టీ, ఫ్లవర్ టీ లేదా రూయిబోస్ టీ వంటి డ్రింక్స్‌కు ‘టీ’ అనే ట్యాగ్ వాడటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలిపింది. ఇకపై ఇలాంటి డ్రింక్స్‌ను ‘Tea’గా కాకుండా ఇతర పేర్లతో విక్రయించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

News December 25, 2025

పలమనేరు: వాట్సప్‌లోనే RTC బస్ టికెట్స్ బుకింగ్

image

APSRTC టికెట్ బుకింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ తెలిపారు. ఇకపై ఎవరైనా బస్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే కౌంటర్ల వద్ద నిలబడే అవసరం లేదన్నారు. 95523 00009 నంబర్‌ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 25, 2025

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.