News December 24, 2025
GNT: బస్సు నడుపుతుండగా గుండెనొప్పి.. 68 మందిని కాపాడాడు

పెదనందిపాడు మండలం వరగాని వద్ద ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి చూపారు. పర్చూరు నుంచి గుంటూరు వెళ్తుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి నిలిపివేశారు. దీంతో బస్సులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను స్థానిక ఆలీ క్లినిక్‌కు, అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News December 27, 2025
బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానం: కలెక్టర్

గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నుంచి బాపట్ల జిల్లా ఎస్పీ ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
News December 27, 2025
గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.
News December 27, 2025
సరిగ్గా నిద్ర పోవట్లేదా..?

నైట్ ఔట్‌లు, సినిమాలు, షికార్లు అంటూ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు జాబ్ వల్ల సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. కారణమేదైనా రోజుకు కనీసం 7గం. నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర, విశ్రాంతి లభించకపోతే బోలెడు వ్యాధులు చుట్టుముడతాయి. బీపీ, షుగర్, డిప్రెషన్, ఊబకాయంతో పాటు హార్ట్‌స్ట్రోక్, గుండె జబ్బులు కూడా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ShareIt.


