News December 24, 2025
రూ.100 కోట్ల అక్రమాస్తులు.. కిషన్ నాయక్‌కు 14 రోజుల రిమాండ్

TG: మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన నివాసాల్లో చేస్తున్న <<18652795>>సోదాల్లో<<>> పలు జిల్లాల్లో 40 ఎకరాల పొలం, హోటళ్లు, భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్ల పైగానే ఉంటుందని సమాచారం.
Similar News
News December 28, 2025
కేసీఆర్ వస్తున్నారా?

TG: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి ఇవాళ ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే సభకు హాజరయ్యేది, లేనిది ఇవాళ రాత్రిలోపు క్లారిటీ రానుంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, ఆయన ప్రసంగం వినడానికి ఎదురుచూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. మీరేమంటారు?
News December 28, 2025
MGNREGAపై కాంగ్రెస్ మొసలి కన్నీరు: కేంద్ర మంత్రి

రాజకీయ లబ్ధి కోసమే <<18686966>>ఉపాధి హామీ పథకం<<>>పై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని కేంద్ర మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. కొత్త చట్టం ఆమోదం పొందిన తర్వాత ఆ పార్టీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, విధానం రెండూ లేవన్నారు. ‘ఓట్ల కోసం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టిందీ, క్రమంగా బడ్జెట్ తగ్గించిందీ ఇదే కాంగ్రెస్. వేతనాలు ఆపిందీ కాంగ్రెస్సే’ అని తెలిపారు.
News December 28, 2025
నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(NFSU) 31 నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, BLSc, MLSc, NET/SLET, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://beta.nfsu.ac.in


