News December 24, 2025
అవినీతి జలగలు.. విశాఖలో అటెండర్ ఆస్తి తెలిస్తే షాక్!

నగరంలోని సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు కార్యాలయంలో పాటు అటెండర్, జూనియర్ అసిస్టెంట్ ఇళ్ళపైనా నిన్న ఏసీబీ దాడులు చేసింది. మోహన్ రావు ఇంట్లో లెక్కకు మించి ఆస్తులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా అటెండర్ ఆనంద్ కుమార్ ఇంటిలో రూ.కోటి విలువైన ఆస్తుల్ని గుర్తించారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ సుధారాణి ఇంట్లో కూడా కోటి రూపాయలు పైబడి స్థిర, చరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
Similar News
News December 30, 2025
బంగ్లా మాజీ ప్రధాని మృతి.. మోదీ దిగ్భ్రాంతి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లా ప్రజలకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. బంగ్లా మొదటి మహిళా ప్రధానిగా ఆమె ఇండియాతో సంబంధాలు, అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. 2015లో ఖలీదాతో సమావేశమయ్యానని గుర్తు చేసుకున్నారు.
News December 30, 2025
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 30, 2025
వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.


