News December 24, 2025
GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Similar News
News January 12, 2026
PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.
News January 12, 2026
GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.
News January 12, 2026
తెనాలి సబ్ కలెక్టర్‌కు పదోన్నతి.. బదిలీ..!

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.


