News December 24, 2025
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.9℃గా నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 11.0℃గా నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 11.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్‌లో 11.4℃ల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ఏరియాలో చలి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 20, 2026
NZB: 21, 22 తేదీల్లో ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు: DIEO

ఈనెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పని సరిగా హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు గైర్హాజరైనా వారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News January 20, 2026
మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.
News January 20, 2026
కామారెడ్డి: పదో తరగతి విద్యార్థినులకు ఇస్రో సందర్శన భాగ్యం

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థినులు, వారితో పాటు 30 మంది ఉపాధ్యాయులు ఈనెల 29 ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.


