News December 24, 2025

GNT: ఆర్టీసీలో ఇక ‘ఎలక్ట్రిక్’ పరుగు.. పల్లెవెలుగు కూడా ఏసీనే.!

image

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. పల్లెవెలుగు సహా అన్నీ ఏసీ బస్సులే కావడం విశేషం. గోదావరి పుష్కరాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయి. దశలవారీగా 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీలను తేనున్నారు. 2030 నాటికి పూర్తిగా కాలుష్య రహిత బస్సులే లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎం ఈ-బస్ సేవ కింద మరో 750 బస్సులు రానున్నాయి.

Similar News

News December 28, 2025

ప.గో: మానని గాయం.. వీడని శోకం

image

ఉమ్మడి ప.గో జిల్లాను 2025లో వరుస విషాదాలు కుదిపేశాయి. మార్చిలో తాడేపల్లిగూడెం సమీపాన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో గోదావరి వరదలు పోలవరం, ఏలూరును అతలాకుతలం చేశాయి. అక్టోబరులో ‘మొంథా’ తుఫాను భీమవరం పరిసరాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. ఇక డిసెంబరులో పోలమూరు, సూరప్పగూడెం వద్ద జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు.

News December 28, 2025

14వ స్థానంలో కర్నూలు జిల్లా.!

image

అన్ని పోలింగ్ కేంద్రాలకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను తక్షణమే నియమించుకోవాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి శనివారం ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో BLOలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల మ్యాపింగ్‌లో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని, జనవరి చివరికి గ్రామాల్లో 75%, పట్టణాల్లో 85% మ్యాపింగ్ పూర్తిచేస్తామన్నారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు BLOలను సస్పెండ్ చేశామన్నారు.

News December 28, 2025

గ్లిజరిన్‌తో చర్మానికి ఆరోగ్యం

image

గ్లిజరిన్ ఒక హ్యుమెక్టెంట్ అంటే ఇది చర్మం నుంచి తేమను లాగకుండా నిరోధిస్తుంది. లోపలి నుంచి తేమను నిలుపుకుంటుంది. పొడి చర్మతత్వం ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చర్మ ఎలాస్టిసిటీని పెంచి ముడతలు రాకుండా చూస్తుంది. గ్లిజరిన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. దీన్ని నేరుగానూ లేదా ఇతర ఉత్పత్తుల్లో కలిపీ వాడొచ్చంటున్నారు.