News December 24, 2025

పరవాడ: ఫోర్జరీ పత్రాలతో భూమిని విక్రయించిన వ్యక్తి అరెస్టు

image

ఫోర్జరీ పత్రాలతో భూమిని విక్రయించిన పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామానికి చెందిన టి.సత్యనారాయణను అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు మంగళవారం తెలిపారు.అదే మండలం వాడ చీపురుపల్లి పరిధిలో 321 సర్వే నెంబర్లో 6.86 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించాడు. దీనిపై భూమి యజమాని ఎం.సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అరెస్టు చేసామన్నారు.

Similar News

News December 30, 2025

సంగారెడ్డి: మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

టాస్క్, ఐక్యూ ఏసీ విభాగాల ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ అరుణ బాయి జాబ్ మేళాను ప్రారంభించారు. మొత్తం 72 మంది విద్యార్థులు జాబ్ మేళాకు హాజరయ్యారు. ప్రతిభ చూపిన వారిని వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆమె తెలిపారు.

News December 30, 2025

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

image

పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GHMCపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇద్దరు Addl.కలెక్టర్లను నియమించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు సృజన, మల్కాజిగిరి, LBనగర్, ఉప్పల్ జోన్లకు వినయ్ కుమార్‌ను కేటాయించింది. PR&RD డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, NZB కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి, NLG కలెక్టర్‌గా చంద్రశేఖర్, నారాయణపేట్ Addl.కలెక్టర్‌గా ఉమాశంకర్‌ను నియమించింది.

News December 30, 2025

BREAKING: నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ

image

నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను GHMC అడిషనల్ కమిషనర్ (మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్స్)గా నియమించారు. ఇక నిజామాబాద్ కలెక్టర్‌గా 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రానున్నారు.