News December 24, 2025

గోళ్లు పుచ్చిపోయాయా?

image

ఎక్కువగా నీళ్లల్లో తడవడం, పనిచేయడం వల్ల కాలి గోళ్లు పచ్చబడి, తేలికగా విరిగిపోతుంటే నెయిల్ ఫంగస్‌ సోకినట్లని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు ఒక ప్లాస్టిక్ టబ్లో కలుపుకోవాలి. ఈ నీళ్లలో పాదాలను అరగంట పాటు ఉంచాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పక చేయాలి. ఫంగస్ వదిలి గోళ్లు సాధారణ రంగులోకి వచ్చినా, ఈ చిట్కాను మానేయకుండా మరికొన్ని రోజుల వరకూ కొనసాగించాలి.

Similar News

News December 25, 2025

బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

image

17 ఏళ్ల తర్వాత బంగ్లా డార్క్ ప్రిన్స్ తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రానుండడాన్ని పెను మార్పుగా దౌత్యవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారత్‌కు సానుకూల అంశంగా విశ్లేషిస్తున్నారు. బంగ్లాలో రెచ్చిపోతున్న మత ఛాందసవాదులు, జమాత్ ఏ ఇస్లామీ లాంటి యాంటీ ఇండియా, పాకిస్థాన్ అనుకూల శక్తులకు చెక్ పెట్టడానికి తారిఖ్ నాయకత్వంలోని BNP కీలకం కానుంది. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయి.

News December 25, 2025

పశువుల్లో ‘జోన్స్’ వ్యాధి లక్షణాలు – జాగ్రత్తలు

image

ఈ వ్యాధి సోకిన పశువు చర్మం మొద్దుబారడం, బక్కచిక్కడం, వెంట్రుకలు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫలితంగా పశువులకు ఆకలి ఉండదు. దీంతో శరీరం అంతా నీరసించి లేవలేని స్థితికి చేరుతుంది. ఈ వ్యాధిని నిర్మూలించాలంటే అంత సులువు కాదు. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. పశువు యొక్క స్థితిని బట్టి సెలైన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారం అందించాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.

News December 25, 2025

ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గురించి తెలుసా?

image

కర్ణాటకలోని తుప్పూరు కి చెందిన డాక్టర్ కె. నందిని పీహెచ్‌డీ పూర్తయిన వెంటనే ఇస్రోలో ఉద్యోగంలో చేరారు. 20ఏళ్లుగా ఇస్రోలో ఉద్యోగం చేస్తున్న ఆమె 14పైగా మిషన్లలో పనిచేశారు. ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్‌గా వర్క్ చేయడంతో పాటు మంగళయాన్ ప్రాజెక్ట్‌లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరక్టర్‌గా ఈమె వ్యవహరించారు. అలాగే ఎన్నో సత్కారాలు పొందడంతో పాటు 2015లో ‘ఇండియా టుడే ఉమెన్ ఇన్ సైన్స్’ అవార్డు కూడా అందుకున్నారు.