News December 24, 2025

నేడు వామనావతారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీరామచంద్రుడు వామనావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బలి చక్రవర్తి అహంకారాన్ని అణచి, మూడు అడుగులతో విశ్వాన్ని కొలిచిన స్వామివారి వైభవాన్ని చూసి భక్తజనం పరవశించనుంది. కాగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక శోభతో భద్రాద్రి క్షేత్రం రామనామస్మరణతో మారుమోగుతోంది.

Similar News

News December 29, 2025

ఆరావళి కొండల నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే!

image

ఆరావళి కొండల కొత్త నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో పాత ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ అప్పటివరకు మైనింగ్ పనులు ఆపాలని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.

News December 29, 2025

ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

image

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News December 29, 2025

మేడారంలో అధికారులకు ఎస్పీ సూచనలు

image

మేడారం మహా జాతర సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరించారు. ముందస్తు మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.