News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 2, 2026

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లా మీదుగా నడిచే రెండు ప్రధాన రైళ్లను జిల్లాలోని తిలారు, బారువ, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ లో ఆగనున్నట్లు తెలిపారు. తిలారులో బరంపురం-విశాఖ ఎక్స్ ప్రెస్(18525/18526), బారువలో విశాఖపట్నం న్యూ విశాఖ ఎక్స్ ప్రెస్(22819/22820), ఇచ్ఛాపురంలో పూరీ-అహ్మదాబాద్(12843/12844) రైళ్లు ఆగనున్నట్లు తెలిపారు.

News January 2, 2026

రణస్థలం: ‘108 నిర్లక్ష్యం లేదు’

image

రణస్థలం సూర్య స్కూల్ పరిధిలో డిసెంబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం తెలిసిందే. 108 రావడం ఆలస్యం కావడంతోనే ఆ వ్యక్తి మరణించాడని స్థానికులు కొందరు తెలపడంతో Way2Newsలో అలాగే ప్రచురితమైంది. కానీ సాంకేతిక సమస్య కారణంగా 108కు కాల్ రీచ్ కాలేదు. కాసేపటికే కాల్ కనెక్ట్ కావడంతో వెంటనే ప్రమాద స్థలికి అంబులెన్స్ వెళ్ళింది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అధికారులు తెలిపారు.

News January 2, 2026

నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

image

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.