News December 24, 2025
చిత్తూరు చిన్నది.. టాలెంట్‌లో గొప్పది.! ❤️

పిట్ట కొంచెం కూత ఘనం అంటె ఇదే. చిత్తూరుకు చెందిన 1వ తరగతి విద్యార్థిని పీ.హేత్విక వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకుంది. వేలూరులో జరిగిన ఎలైట్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో “స్పెల్ మారథాన్” అనే అంశంలో ఆమె సత్తా చాటింది. 4 నిమిషాలలో 50 ఆంగ్ల పదాలు అక్షర దోషం లేకుండా మౌఖికంగా చెప్పినందుకు అవార్డును సాధించింది. నృత్య ప్రదర్శనలోనూ హేత్విక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మరో రికార్డును సాధించడం విశేషం.
Similar News
News January 11, 2026
KNR: నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ దరఖాస్తు

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు గాను ఐఈఎల్‌టీఎస్ ఇంగ్లిష్ ఉచిత శిక్షణ దరఖాస్తు ఆదివారంతో ముగుస్తుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 11, 2026
HYD: పతంగుల పండుగ.. పిల్లలు పైలం!

సంక్రాంతి వచ్చిందంటే పిల్లల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. పతంగులు ఎగురవేయడంలో పరస్పరం పోటీ పడుతూ సంబరాలు చేసుకుంటారు. తెగిపోయిన వాటికోసం పరుగులు పెడుతుంటారు. రోడ్లు, గుంతలు గమనించకుండా పతంగులను పట్టుకోవాలనే ఆత్రుతలో ప్రమాదాలకు ఎదురెళ్తారు. రేలింగ్ లేని బంగ్లాలపై కైట్‌లు ఎగురవేయడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి.
✦ పేరెంట్స్ పిల్లలపై నజరేయండి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి.
News January 11, 2026
JGTL: ఆఖరి మజిలీకి ముందే సమాధి నిర్మాణం.. అందులోనే అంత్యక్రియలు

మరణం అనివార్యం.. చివరి ప్రయాణమే గౌరవంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్(M) లక్ష్మీపూర్‌కు చెందిన నక్క ఇంద్రయ్య తన చివరి మజిలీకి ముందే తన తోటలోనే రూ.12 లక్షలు పెట్టి గ్రానైట్‌తో సమాధిని నిర్మించుకున్నారు. అప్పట్లో అది చాలా వైరల్‌గా మారింది. అయితే, ఇంద్రయ్య శనివారం మృతి చెందడంతో తన కోరిక ప్రకారం ముందే నిర్మించిన సమాధిలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేయడం విశేషం.


