News December 24, 2025
సిరిసిల్ల: IELTS FREE TRAINING.. 9 రోజులే ఛాన్స్

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులకు ఉచిత IELTS శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ జె.వెంకటస్వామి తెలిపారు. డిగ్రీ, బీటెక్, బీ.ఫార్మసీ పూర్తి చేసినవారు, చివరి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు. ఒకరోజు అవగాహన సదస్సు, 40 గంటల శిక్షణ నిర్వహిస్తారు. 2026 జనవరి 1 వరకు www.tgbcstudycircle.cgg.gov.inలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. వివరాలకు 040-24071178 సంప్రదించాలి.
Similar News
News December 28, 2025
త్వరలో పాలమూరుకు కేసీఆర్: శ్రీనివాస్ గౌడ్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని విమర్శించారు.
News December 28, 2025
గాలిపటం కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

TG: గాలిపటం కొనివ్వలేదని రెండో తరగతి చదువుతున్న బాలుడు(9) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మహబూబ్‌నగర్(D) చిల్వేర్‌లో జరిగింది. రాజు-శ్రీలత దంపతుల కుమారుడు సిద్ధూ పతంగి కొనివ్వమని అడగగా నిరాకరించారు. దీంతో అతడు పేరెంట్స్‌ను భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరి వేసుకున్నట్లు నటించాడు. కానీ దురదృష్టవశాత్తు అది మెడకు బిగుసుకుపోయింది. విలవిల్లాడుతున్న సిద్ధూను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
News December 28, 2025
ఈ నెల 9 నుంచి ప్రజావాణి: నిర్మల్ కలెక్టర్

ఈ నెల 29 నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి రేపటి నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణికి హాజరుకావాలని సూచించారు.


