News April 22, 2024

ప్రకాశం: 30,928 మంది విద్యార్థుల ఉత్కంఠ

image

జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 170 కేంద్రాల్లో 30,928 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 30న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు. మూల్యంకనం ముగిసిన 14 రోజులకే ఫలితాలు ప్రకటించడం ప్రభుత్వ పరీక్షల బోర్డు చరిత్రలో ఒక రికార్డు అని డీఈవో సుభద్ర తెలిపారు. మరికొద్ది సేపట్లో ఫలితాలు రానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News March 13, 2026

ప్రకాశం: రైతుల ఖాతాల్లో రూ.108.30 కోట్లు మంజూరు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.N పాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.

News March 12, 2026

మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

image

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.

News March 12, 2026

పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

image

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.