News December 24, 2025
దక్షిణ భారత యువజనోత్సవాల్లో ANU విద్యార్థుల ఘన విజయం

చెన్నై వేదికగా జరిగిన దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల యువజనోత్సవ పోటీల్లో ANU విద్యార్థులు మెరిశారు. హిందుస్థాన్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన 39వ యువజనోత్సవాల్లో ఫోక్, గిరిజన నృత్యాలు, క్రియేటివ్ కొరియోగ్రఫీ, కాలేజ్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. థియేటర్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయాలు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని సమన్వయకర్త ఆచార్య మురళీమోహన్ పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
ప్రభాస్ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV ట్వీట్

శివాజీ వ్యాఖ్యలతో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చర్చ జరుగుతున్న వేళ <<18683006>>RGV<<>> మరోసారి ఈ విషయంపై స్పందించారు. ‘రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ నిధి, మాళవిక, రిద్ధి వేసుకున్న డ్రెస్సులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ‘ప్రభాస్ హీరోయిన్స్ శివాజీ అండ్ కో అరుపులు పట్టించుకోకుండా వారికి నచ్చిన దుస్తులను ధరించారు. ఈ ముగ్గురు ‘హీరో’ (హీరోయిన్లను అభివర్ణిస్తూ)లు ఆ విలన్ల చెంప పగలగొట్టారు’ అని ట్వీట్ చేశారు.
News December 29, 2025
నేటి ముఖ్యాంశాలు

* కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: PM మోదీ
* పేదల హక్కులపై BJP దాడి: ఖర్గే
* రేపు అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
* నీటిపారుదల శాఖపై CM రేవంత్ సమీక్ష.. అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలపై వ్యూహం సిద్ధం
* అయోధ్యను దర్శించుకున్న CM CBN.. శ్రీరాముడి విలువలు అందరికీ ఆదర్శమని ట్వీట్
* శ్రీలంక ఉమెన్స్‌తో 4వ టీ20లో భారత్ విజయం
* భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.300
News December 29, 2025
నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.


