News December 24, 2025

హైకోర్టుల్లో కేసుల విచారణ ఇలా!

image

హైకోర్టుల్లో కేసుల విచారణ క్రమ పద్ధతిలో జరుగుతుంది. TG HCలో 32, APలో 23 హాళ్లున్నాయి. హాల్‌-1లో CJ పిల్‌, రిట్ పిటిషన్లను విచారిస్తారు. 2-3 జడ్జిలుండే డివిజన్ బెంచ్‌లు(H2-10) క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్‌ కార్పస్‌ కేసులను చేపడతాయి. మిగిలిన హాళ్లలో సింగిల్ బెంచ్‌లు సివిల్, క్రిమినల్, బెయిల్ పిటిషన్ల వాదనలు వింటాయి. ఈ కేసులే విచారించాలనేది ఫిక్స్ కాదు. <>‘డైలీ కాజ్ లిస్ట్’తో<<>> వివరాలు తెలుసుకోవచ్చు.

Similar News

News December 27, 2025

10 రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం: TTD EO

image

AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.

News December 27, 2025

గర్భనిరోధక మాత్రలు వాడితే పీరియడ్స్ ఆలస్యం అవుతాయా?

image

గర్భనిరోధక మాత్రల్లో వివిధ రకాల హార్మోన్‌లు, రసాయనాలు ఉంటాయి. ఇవి నేరుగా మీ జీవవ్యవస్థపై పని చేసి మీ ఋతు చక్రంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కొందరు స్త్రీలలో తేలికపాటి రక్తస్రావం అవుతుంది. ఈ పిల్స్‌ ప్రభావం వల్ల మరి కొంతమంది పీరియడ్స్‌ కొంతకాలం పాటు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వీటిని ఎక్కువగా వాడితే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

News December 27, 2025

పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడానికి కారణాలు

image

చలిని తట్టుకోవడానికి పశువులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అలాగే ఈ సమయంలో జీవాల్లో జీర్ణప్రక్రియ మందగించడం వల్ల అవి సరిగా గడ్డి, దాణా తీసుకోవు. ఫలితంగా వాటికి కావాల్సిన పోషకాలు అందవు. చలికాలంలో పచ్చిగడ్డి లభ్యత కూడా తగ్గుతుంది. పశువుల్లో ఒత్తిడి (కోల్డ్ స్ట్రెస్) కారణంగా అవి ఆహారం సరిగా తీసుకోవడానికి ఇష్టపడవు. పొదుగువాపు, జ్వరం, నిమోనియా వంటి వ్యాధుల ముప్పు పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి.