News December 24, 2025

సిరిసిల్ల: మానాల గుట్టల్లో చిరుత సంచారం..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రుద్రంగి- మానాల మధ్యగల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఓ ఆవుల మంద వద్దకు మంగళవారం రాత్రి చిరుత వచ్చినట్లు చెప్పారు. సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేసేవారు కూడా చిరుత వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో ఇక్కడిది కాదని వారు పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

చిరుత ఆచూకీ కోసం గ్రామస్థులతో అధికారుల ఆపరేషన్

image

చిరుతపులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మానాల సమీపంలోని గుట్టల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఫారెస్ట్ బీట్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో అటవీ సిబ్బంది, గ్రామస్థులు చిరుత కనిపించినట్లు చెబుతున్న ప్రాంతంతో పాటు సమీప పరిసరాల్లో గాలిస్తున్నారు.

News December 24, 2025

సిరిసిల్ల: గురుకులాల్లో ప్రవేశాలు.. JAN 21 LAST DATE

image

గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి వెంకన్న తెలిపారు. సిరిసిల్లలో బుధవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అడ్మిషన్ కోసం అన్ని గురుకులాలకు కలిపి కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి ఈ సీట్లను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన దరఖాస్తులు 2026 JAN 21 వరకు సమర్పించవచ్చు.

News December 24, 2025

బోయినపల్లి: ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు

image

ఆయిల్ పామ్ సాగు అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుందని, పంట వేసిన నాల్గో ఏడాది నుంచి అధిక దిగుబడి.. ఆదాయం వస్తుందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖా ఆధ్వర్యంలో బోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. అధికారులు, రైతులు పాల్గొన్నారు.