News December 24, 2025

విశాఖ 10 జోన్‌లకు కమిషనర్ల నియామకం

image

జీవీఎంసీ పరిధిలో పది జోన్లు ఏర్పాటు కావడంతో జోనల్ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-1 నాగేంద్ర కుమార్. జోన్-2 నాయుడు, జోన్-3 శివప్రసాద్. జోన్-4 మల్లయ్య నాయుడు, జోన్-5 రాము, జోన్-6 హైమావతి, జోన్-7 శంకర్రావు, జోన్-8 తిరుపతి, జోన్-9 శేషాద్రి, జోన్-10 చక్రవర్తిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 25, 2025

అనకాపల్లి: ‘త్వరితగతిన విద్యా రుణాలు మంజూరు చేయాలి’

image

తల్లిదండ్రుల సివిల్ స్కోర్ చూడకుండా విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో బ్యాంకు రుణాలు మంజూరుపై సమీక్ష నిర్వహించారు. కౌలు రైతులకు, పీఎం సూర్య ఘర్ పథకానికి పరిశ్రమలు, డెయిరీ, స్వయం సహాయక బృందాలకు రుణాలు అందజేయాలన్నారు. లక్ష్యానికి మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు.

News December 25, 2025

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

image

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.

News December 25, 2025

ATP: మహిళను నమ్మించి మోసం చేశారు!

image

ఉరవకొండ మం. నింబగల్లులో బంగారు నగలకు మెరుగు పెడతామని నమ్మించి స్వరూప అనే మహిళ వద్ద 2 తులాల గొలుసును దుండగులు అపహరించారు. ఇద్దరు వ్యక్తులు ఇత్తడి సామాన్లతో పాటు గొలుసును శుభ్రం చేస్తామని నమ్మించారు. గిన్నెలో ఆమె గొలుసు వేసి చాకచక్యంగా చోరీ చేశారు. అనుమానం రాకుండా నీటిపై పలు రంగులు వేసి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టమని అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత గిన్నెను పరిశీలించిన గొలుసు లేకపోవడంతో కంగుతింది.