News December 24, 2025
ఢిల్లీలో ఉంటే అలర్జీలు వస్తున్నాయి: నితిన్ గడ్కరీ

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. “ఢిల్లీలో 3 రోజులు ఉంటేనే నాకు అలర్జీలు వస్తున్నాయి” అని అన్నారు. ఢిల్లీ-NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో కాలుష్యంలో 40% రవాణా రంగం నుంచే వస్తోందని వెల్లడించారు. ఢిల్లీకి వచ్చే ప్రతిసారీ వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తానని, పొల్యూషన్ భయంకరంగా ఉందన్నారు.
Similar News
News December 26, 2025
APPLY NOW: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్/ మెకానికల్/ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/
News December 26, 2025
‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.
News December 26, 2025
ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.


