News December 24, 2025

చిక్కడపల్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ అమ్మిన యువతి అరెస్ట్

image

చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్‌ గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది.

Similar News

News December 26, 2025

పార్వతీపురం జిల్లాలో ఘనంగా వీర్ బాల్ దివాస్-2025 వేడుకలు

image

భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్న పిల్లలను గౌరవించేందుకు ఈ వేదిక అని జిల్లా కలెక్టర్ డా.ఎం.ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే ‘వీర్ బాల్ దివాస్’ వేడుకలు మన్యం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం పార్వతీపురంలోని ఆర్సీఎం పాఠశాలలో అవగాహన ర్యాలీ ప్రారంభించారు. చిన్న వయస్సులోనే అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సాహిబ్‌జాదాల చరిత్ర నేటి తరం పిల్లలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

News December 26, 2025

నాగర్ కర్నూల్: కవిత పర్యటన వివరాలు

image

ఎమ్మెల్సీ కవిత శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు పంప్ హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు పెంట్లవెల్లిలో రుణమాఫీ కాని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మెడికల్ కాలేజ్, వట్టెం రిజర్వాయర్, సిర్సవాడ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

News December 26, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. డే విజన్, నైట్ విజన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మద్యపానం, గంజాయి విక్రయాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ డ్రోన్ల వినియోగం ఎంతో కీలకంగా మారుతుందని ఆయన వివరించారు.