News December 24, 2025

సంగారెడ్డి: మహిళ గొంతు కోసిన నిందితుడు అరెస్ట్

image

కంది మండలం మామిడిపల్లి శివారులో సుజాత అనే మహిళ గొంతు కోసి చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ సత్తయ్య గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన జగన్(37) రాపిడో డ్రైవర్‌గా చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే బంగారం కోసం మహిళపై దాడికి పాల్పడ్డాడని వివరించారు.

Similar News

News December 31, 2025

‘గల్వాన్’ గొడవ.. అసలు అప్పుడేమైంది?

image

<<18714683>>గల్వాన్ లోయ<<>>లో 2020 జూన్ 15న ఇండియా, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా ఆర్మీకి భారత సైనికులు అడ్డునిలిచారు. రాడ్లు, రాళ్లతో 6 గంటలపాటు దాడి చేసుకోవడంతో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో TGకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సంతోష్‌బాబు పాత్రనే <<18686152>>సల్మాన్<<>> పోషిస్తున్నారు.

News December 31, 2025

NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

image

నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్‌లో చదివారు. రెండో అటెంప్ట్‌ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్‌గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్‌గా పని చేశారు.

News December 31, 2025

Khaleda Zia: ఇండియాలో పుట్టి.. ఇండియా వ్యతిరేకిగా మారి..

image

బంగ్లాదేశ్ Ex PM <<18709090>>ఖలీదా జియా<<>>(80) నిన్న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో పుట్టిన ఆమె భారత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. PMగా పదేళ్లలో గంగా జలాలు, వలసదారులు వంటి ఎన్నో అంశాల్లో మనతో ఘర్షణలకు దిగారు. భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాలో ఆశ్రయమిచ్చారు. పాక్, చైనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నాడు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి. హసీనా హయాంలో పరిస్థితి మారింది.