News April 24, 2024
మెదక్: ఇటు నామినేషన్లు… అటు కార్నర్ మీటింగ్స్

ఓ వైపు నామినేషన్ల ఘట్టం.. మరోవైపు ప్రచార పర్వం ఊపందుకోవడంతో మెదక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రముఖుల రాకతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఇప్పటికే BJP, కాంగ్రెస్‌లు కార్నర్ మీటింగ్‌లు నిర్వహించగా.. BJP మీటింగ్‌కు గోవా CMతో పాటు కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ మీటింగ్‌కు CM రేవంత్ రాగా, వచ్చేనెల 7న BRS అధినేత KCR బస్సుయాత్రలో భాగంగా మెదక్ రానున్నట్లు శ్రేణులు చెబుతున్నారు.
Similar News
News March 13, 2026
మెదక్: ఇంటర్ విద్యార్థులకు యాక్సిడెంట్

టేక్మాల్ మండలం కద్దులూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పులర్ నుంచి అల్లాదుర్గ్ పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 సిబ్బంది మహేష్ కుమార్, దుర్గయ్య ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ప్రమాదానికి గురవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 13, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.
News March 13, 2026
గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధి: కలెక్టర్

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత, పెన్షన్లు, ఉపాధి హామీ, పాఠశాలల పర్యవేక్షణపై అధికారులు సూచనలు ఇచ్చారు.


