News December 24, 2025
నల్గొండ: మున్సిపల్ పోరుకు సమాయత్తం..!

గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేలా సంకేతాలు వెలువడుతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ పోరు జరగొచ్చనే అంచనాతో అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులు సమాయత్తమవుతున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల వేడి చల్లారక ముందే జిల్లాలో మరోమారు పొలిటికల్ హీట్ పెరిగింది.
Similar News
News December 25, 2025
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు అండగా నిలిచారు. మల్హర్ మండలం అడువాలపల్లికి చెందిన కొత్తపెల్లి సుమన్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం దుస్థితిని తెలుసుకున్న మంత్రి.. వెంటనే ఎల్వోసీ మంజూరు చేశారు. ఆసుపత్రికి ఎలాంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకుని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
News December 25, 2025
వార్నర్ రికార్డు సమం చేసిన రోహిత్

సుమారు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భారీ శతకంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచులో 155 పరుగులు చేసిన హిట్ మ్యాన్ లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సార్లు 150+ స్కోర్ చేసిన ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్(9) రికార్డును సమం చేశారు. అంతేకాకుండా అనుస్తుప్ మజుందార్(39y-బెంగాల్) తర్వాత VHTలో శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్(38y 238d) నిలిచారు.
News December 25, 2025
MBNR: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్‌నగర్ బాలికల జట్టు రన్నర్స్ (2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ రాజు ‘Way2News’ప్రతినిధితో తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.


