News December 24, 2025
గద్వాల: కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన రైతు జమ్మన్న(63) గుండెపోటుతో మృతి చెందారు. పంట విక్రయం కోసం నాలుగు రోజులుగా వేచి చూస్తున్న ఆయన, బుధవారం తూకం వేసే సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. తోటి రైతులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ధాన్యం రాశుల వద్దే ప్రాణాలు వదలడం విషాదం నింపింది.
Similar News
News December 26, 2025
NTR: సీఎం ఆదేశాలు బేఖాతరు.. DRCకి పాలకుల డుమ్మా!

NTR జిల్లా ప్రగతి, అభివృద్ధిపై శుక్రవారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ DRC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట MLA శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. MP కేశినేని, మిగతా MLAలు డుమ్మా కొట్టారు. నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి దోహదపడే ఈ సమావేశానికి నేతల గైర్హాజరుపై విమర్శలొస్తున్నాయి. DRCలో ప్రజాప్రతినిధులు తప్పక పాల్గొనాలని CM చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినా నేతలు బేఖాతరు చేయడం గమనార్హం.
News December 26, 2025
విద్యార్థులు తప్పక వీక్షించాలి: తిరుపతి DEO

రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోందనితిరుపతి DEO కేవీన్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆధునిక, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు తప్పక వీక్షించాలన్నారు.
News December 26, 2025
మేడారం మహా జాతరకు జంపన్నవాగు సిద్ధం..!

మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం జంపన్న వాగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవతల దర్శనానికి ముందు భక్తులు వాగులో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం రూ.5.50 కోట్లతో ఇసుకను చదును చేసి, 39 బావులను శుభ్రపరిచి పైపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.


