News December 24, 2025

PHOTOS: పొలంలో సల్మాన్‌, ధోనీ

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మహారాష్ట్రలోని పన్వెల్ ఫామ్‌హౌస్‌లో భారత క్రికెట్ దిగ్గజం ధోనీ, సింగర్ ఏపీ ధిల్లాన్ సందడి చేసిన ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలం దున్నిన తర్వాత ఒళ్లంతా బురదతో ఉన్న సల్మాన్, ధోనీ కలిసి దిగిన ఫొటో తెగ వైరలవుతోంది. స్టార్స్ హోదాను పక్కనపెట్టి ప్రకృతి ఒడిలో వీరు గడపడంపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Similar News

News December 26, 2025

జైలర్-2లో షారుఖ్ ఖాన్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో లీక్ ఇచ్చారు. జైలర్-2లో మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు నటిస్తున్నారని చెప్పారు. మూవీలో విలన్‌గా మిథున్ కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ కానుంది.

News December 26, 2025

బోరాన్ స్ప్రేతో మామిడి పంటకు కలిగే లాభాలు

image

బోరాన్ పిచికారీ వల్ల పూత, పిందె రాలడం, పండ్లు పగలకుండా ఉండటమే కాకుండా.. ఇవి మామిడి పండ్లలో చక్కెర, విటమిన్ సి స్థాయిలను, గుజ్జు శాతాన్ని పెంచుతుంది. బోరాన్‌ను లేత పూత దశలో మరియు పిందెలు వృద్ధి చెందే దశలో పిచికారీ చేసే పురుగు మందులతో కలిపి స్ప్రే చేయవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇలా చేయడం వల్ల రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెబుతున్నారు. నిపుణుల సూచనలతో అవసరమైన మోతాదులో బోరాన్ పిచికారీ చేయాలి.

News December 26, 2025

శుక్రవారం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?

image

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహం లక్ష్మీదేవి అధీనంలో ఉంటుంది. అందుకే శుక్రుడు అనుకూలంగా ఉండే ఈ రోజున అమ్మవారిని పూజిస్తే.. ధనం, సౌభాగ్యం, కళాభివృద్ధి లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజున వ్రతాలు, తులసి పూజ, దానధర్మాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం వ్రతం వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.