News December 24, 2025

2,322 ఉద్యోగాలు.. ప్రొవిజనల్ లిస్ట్ విడుదల

image

TG: 2,322 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టులకు సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ లిస్టును <>MHSRB<<>> రిలీజ్ చేసింది. ఈ మెరిట్ జాబితాపై DEC 27 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. తర్వాత సెకండ్ ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసి 2 పోస్టులకు ముగ్గురేసి చొప్పున వెరిఫికేషన్‌కు పిలవనుంది. ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెలలో ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది నవంబర్ 23న పరీక్ష జరగగా 40,423 మంది రాశారు.

Similar News

News February 21, 2026

కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News February 21, 2026

ట్రంప్ టారిఫ్‌ల రద్దు.. భారత్ రియాక్షన్ ఇదే

image

ట్రంప్ విధించిన టారిఫ్‌లను US సుప్రీంకోర్టు రద్దు చేయగా ట్రంప్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తొలిసారి భారత వాణిజ్య శాఖ రియాక్టైంది. US SC ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని చెప్పింది. ఆపై ట్రంప్ వ్యాఖ్యలు, ఆ దేశ యంత్రాంగం ప్రకటించిన కొన్ని చర్యల వల్ల భవిష్యత్తులో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.

News February 21, 2026

రోటీ చెయ్యడానికి ఓ బాక్సు

image

చపాతీ, పూరీలు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని చేయడం ఒక పని అయితే, ఆ తర్వాత వంటగది గట్టు శుభ్రపరచడం మరో పెద్ద పని. అలాకాకుండా ఉండాలంటే ఈ రోటీ బాక్సును ట్రై చేయండి. దీంతో ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు. కదలకుండా ఉండేందుకు నాన్‌స్లిప్‌ ప్యాడ్లు ఉంటాయి. చూడడానికి సూట్‌కేసులా ఉండే ఈ బాక్సును కిచెన్‌లో ఎక్కడైనా సర్దేయొచ్చు. ఇవి అన్ని ఆన్‌లైన్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి.