News December 24, 2025

ఇయర్ బడ్స్‌ను క్లీన్ చేస్తున్నారా? లేదంటే..

image

రోజూ వాడే ఇయర్ బడ్స్ చూడటానికి క్లీన్‌గానే అనిపిస్తాయి. కానీ వాటిలో కిచెన్ సింక్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని సరిగా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు, రాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ వాక్స్ పేరుకుపోయి వినికిడి సమస్యలు రావచ్చు. నెలకు ఒక్కసారైనా సాఫ్ట్ క్లాత్ లేదా టూత్ బ్రష్‌తో బడ్స్‌ను తుడవాలి. నీళ్లతో కడగొద్దు. అవి శుభ్రంగా ఉంటే హెల్త్ సేఫ్‌గా ఉండటంతో పాటు డివైజ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

Similar News

News December 26, 2025

APPLY NOW: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్/ మెకానికల్/ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/

News December 26, 2025

‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

image

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.

News December 26, 2025

ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

image

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.