News December 24, 2025
HYD: 2025లో ‘550’.. గుర్తుందా?

NEW YEAR సెలబ్రేషన్ అంటే సిటీలో బట్టలు చింపుకోవాల్సిందే. ఏజ్‌తో సంబంధం లేకుండా చిల్ అవుతుంటారు. ఏదైనా ఒక మోతాదు వరకు అంటే ఓకే. కానీ, 2025 న్యూ ఇయర్ మీకు గుర్తుందా?. ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. పంజాగుట్టలో బైకర్‌ను ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా ఏకంగా 550 రీడింగ్ నమోదైంది. ఇది చూసి పోలీసులే షాకయ్యారు. న్యూ ఇయర్ రోజే మందుబాబు ఫొటో వైరలైంది. చిల్ అవ్వండి బ్రో.. చిల్లర అవ్వకండి.
Similar News
News December 25, 2025
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 25, 2025
ఇంటర్ సెకండియర్ HTపై ఫస్టియర్ మార్కులు

TG: ఇంటర్ సెకండియర్ పరీక్షల హాల్‌టికెట్‌పై ఇక నుంచి ఫస్టియర్ మార్కులు, పాస్/ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్టియర్ మార్కులు తక్కువొచ్చినా, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా పేరెంట్స్‌కు చెప్పట్లేదు. రెండో ఏడాది చివర్లో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు విద్యార్థుల్లో జవాబుదారీతనం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
News December 25, 2025
నంద్యాల: రూ.8వేల మద్దతు ధరతో కొనుగోలు

నంద్యాల జిల్లాలో నాఫెడ్ ద్వారా రూ.8వేల మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. జిల్లాలో 1.17 లక్షల ఎకరాల్లో 70,562 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం 25,200 టన్నుల కొనుగోలుకు అనుమతులు వచ్చాయని, డీసీఎంఎస్, సహకార సంఘాల ద్వారా ఈ సేకరణ జరుగుతుందని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


