News December 24, 2025
H-1B వీసా కొత్త రూల్: ఎవరికి లాభం?

H-1B వీసాల జారీలో ఏళ్లుగా అనుసరిస్తున్న లాటరీ సిస్టమ్‌ను ఆపేసి మంచి స్కిల్స్ ఉండి అధిక వేతనం వచ్చే వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2026 నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్ల వంటి హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ప్రాముఖ్యత ఇస్తారు. తక్కువ జీతం ఉండే అన్‌స్కిల్డ్ వర్క్ కోసం US వెళ్లాలనుకునే వారికి అవకాశాలు తగ్గొచ్చు. కంపెనీలు తక్కువ జీతం కోసం కాకుండా టాలెంట్ ఉన్నవారికే వీసాలు ఇచ్చేలా ఈ మార్పులు చేశారు.
Similar News
News December 31, 2025
సకల దోష నిర్మూలన కోసం ‘నిమ్మకాయ దీపం’

శని, కుజ, కాలసర్ప దోషాలతో వివాహ, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి నిమ్మకాయ దీపం అత్యుత్తమ పరిహారం అని పండితులు సూచిస్తున్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో రాహుకాలంలో మహిళలు ఈ దీపాలు వెలిగిస్తే ప్రతికూల శక్తులన్నీ తొలగి శుభం కలుగుతుందని చెబుతున్నారు. కుటుంబంలో శాంతి, అష్టైశ్వర్యాల కోసం కూడా ఈ దీపం వెలిగిస్తారు. నిమ్మకాయ దీపం ఎలా వెలిగించాలి, ఇతర నియమాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 31, 2025
ఒనగడోరి కోడి, కిలో రూ.2 లక్షలు.. ఎందుకంటే?

జపాన్‌కు చెందిన అరుదైన, అత్యంత ఖరీదైన కోడి ‘ఒనగడోరి’. ఈ కోళ్లలో మగ కోడి సుమారు 1.8 కిలోలు, ఆడ కోడి 1.35 కిలోల బరువు పెరుగుతాయి. ఒనగడోరి జాతి మగ కోడికి సుమారు 12 అడుగుల వరకు పొడవు ఉండే తోక ఉండి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ కోళ్లను జపాన్ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా, వీనిని పెంచడం, తినడం అదృష్టానికి, శుభానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఈ కోళ్ల ధర స్థానికంగా కిలో రూ.2 లక్షల వరకు ఉంటుంది.
News December 31, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్!

TG: వచ్చే విద్యాసంవత్సరం(2026-27) నుంచి ఇంటర్ బోర్డ్ మ్యాథ్స్ పరీక్షను 60 మార్కులకే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మ్యాథ్స్-A, B పేపర్లకు 75 మార్కుల చొప్పున ఉండగా CBSE తరహాలో 15 మార్కులు ఇంటర్నల్స్ ద్వారా కేటాయించనుంది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుంది. అటు MPC, MEC విద్యార్థులకు ఒకే సిలబస్ ఉండగా వేర్వేరు క్వశ్చన్ పేపర్లతో నిర్వహించేలా వచ్చే ఏడాది సిలబస్‌లోనూ మార్పులు చేయనుంది.


