News December 24, 2025

సిరిసిల్ల: గురుకులాల్లో ప్రవేశాలు.. JAN 21 LAST DATE

image

గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి వెంకన్న తెలిపారు. సిరిసిల్లలో బుధవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అడ్మిషన్ కోసం అన్ని గురుకులాలకు కలిపి కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి ఈ సీట్లను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన దరఖాస్తులు 2026 JAN 21 వరకు సమర్పించవచ్చు.

Similar News

News December 31, 2025

నంద్యాల: ఎస్పీ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా

image

నంద్యాలలో పోలీస్ జిల్లా కార్యాలయంలో 2025 రెండవ విడత మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. జిల్లా స్థాయిలో 662 మొబైల్స్‌ను రికవరీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు. రూ.1,22,47,500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బాధితులకు ఎస్పీ ఫోన్లను అందజేశారు. సీఐ గౌతమి పాల్గొన్నారు

News December 31, 2025

ఇంటి చిట్కాలు మీ కోసం..

image

* చెక్క కుర్చీలు జరిపేటప్పుడు వాటి కాళ్ళకు సాక్సులు వేస్తే నేలపై గీతలు పడకుండా ఉంటాయి.
* కత్తెర, చాకు తుప్పు పడితే వాటిని బ్లాక్ టీలో ఉంచి రెండు మూడు గంటలయ్యాక తీసి పొడి వస్త్రంతో శుభ్రపరచండి.
* ఇంటికి పెయింట్ వేసే ముందు అద్దాలను కిరోసిన్ తో తుడిస్తే మరకలు పడినా సులభంగా వదులుతాయి.
* గాజు గ్లాసులు, సీసాలను మెత్తని ఉప్పుతో శుభ్రపరిస్తే గీతలు పడకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.

News December 31, 2025

APPLY NOW: CDFDలో ఉద్యోగాలు

image

HYDలోని BRIC-సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD)లో 2సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 27వరకు పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి MSc, MTech, ఎండీ, MVSc, M.Pham, M.Biotech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdfd.org.in/