News December 24, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in
Similar News
News December 27, 2025
ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవి కూడా కారణం కావొచ్చు

ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో అంశాలు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం, అధిక ఒత్తిడికి గురవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక/ తక్కువ బరువు, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందంటున్నారు. అందుకే ముందుగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 27, 2025
అంటే.. ఏంటి?: Backyard

ఇంటి వెనక పెరటిని Backyard అంటారు. ఇది Back, Yard పదాలను కలిపితే వచ్చింది. Back అనే ఇంగ్లిష్ పదానికి వెనక అని అర్థం. జర్మన్‌లో Gard అంటే తోట. ఆ పదాన్ని ఇంగ్లిష్‌లోని స్థలం కొలిచే ప్రమాణమైన Yardతో పోలుస్తూ BackYardగా పిలుస్తున్నారు.
రోజూ 12pmకు ఓ ఆంగ్ల పదం అర్థం, వివరణ, పుట్టుక
<<-se>>#AnteEnti<<>>
News December 27, 2025
APPLY NOW: NHIDCLలో ఉద్యోగాలు

NHIDCLలో 64 అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com


