News April 24, 2024
టెన్త్ ఫలితాలు: ఈ స్కూళ్లలో అందరూ ఫెయిల్

AP: రాష్ట్రంలో 2,803 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని(0%) చెప్పారు. ఈ 17 స్కూళ్లలో ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. ఇక 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా తొలి, 62.47%తో కర్నూలు జిల్లా చివరిస్థానాల్లో నిలిచాయి.
Similar News
News March 16, 2026
ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

AP: ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఏప్రిల్-మేలో గరిష్ఠ డిమాండ్ 280MUలుగా అంచనా వేయగా ఈ నెలలోనే 274MUలకు చేరింది. ఇందుకు తగ్గట్లుగానే ఏపీ జెన్‌కో <<19368040>>భారీగా<<>> విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. విజయవాడ VTPS, కడప RTPP, కృష్ణపట్నంలో దాదాపు 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. కాబట్టి కరెంట్ ఉత్పత్తికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు <<19384107>>చెబుతున్నారు<<>>.
News March 16, 2026
ఆస్కార్ అవార్డులు.. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ హవా

*ఉత్తమ సహాయ నటుడు- షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*కాస్టింగ్ – కస్సాండ్రా (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే)- పౌల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే)- ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
*లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్(2 చిత్రాలకు)- ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా
News March 16, 2026
స్కూళ్లు, అంగన్‌వాడీలు నేటి నుంచి ఒంటిపూటే

AP, TGలో ఇవాళ్టి నుంచి స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. APలో ఉ.7.45 గంటలకు, TGలో ఉ.8 గంటలకు ప్రారంభమై మ.12.30 గంటలకు ముగుస్తాయి. ఇక అంగన్‌వాడీలనూ నేటి నుంచే ఒంటిపూట నిర్వహించాలని AP శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. పాఠశాలల మాదిరే ఏప్రిల్ 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని, చిన్నారుల పేరెంట్స్ గమనించాలని సూచించింది.


