News December 24, 2025

ఖమ్మం: తల్లి అనారోగ్యం తట్టుకోలేక కూతురు ఆత్మహత్య

image

కన్నతండ్రి మరణం, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడాన్ని తట్టుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం కవిరాజు నగర్‌కు చెందిన బట్ల సృజన తండ్రి 7ఏళ్ల క్రితం మృతి చెందగా, తల్లి మేరీ పద్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన సృజన.. బుధవారం ఇంట్లో ఉరివేసుకుంది. మరణానికి ముందు చిన్నప్పుడు తల్లితో దిగిన ఫొటోపై ‘క్షమించు అమ్మా.. నీకంటే ముందే వెళ్తున్నా’ అని రాసింది.

Similar News

News December 26, 2025

విశాఖ: హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

image

లంకెలపాలెం లేఔట్‌లో ఈ నెల 24న దారుణ హత్యకు గురైన వెంకు నాయుడు కేసులో ఏడుగురు ముద్దాయిలను పరవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వ్యభిచార కార్యకలాపాల్లో వెంకు నాయుడు, తేజ మధ్య ఆదిపత్య పోరు చోటు చేసుకుంది. దీంతో తేజ, దేముడు నాయుడు కలిసి మరో ఐదుగురి సహకారంతో హత్య చేశారు. ఈ అందర్నీ అరెస్ట్ చేసినట్లు DSP విఘ్ణ స్వరూప్ తెలిపారు. హత్య జరిగిన 48 గంటల్లోనే కేసు చేధించామని పేర్కొన్నారు.

News December 26, 2025

WGL: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

జిల్లాలోని చెన్నారావుపేట మండలం లింగాపురంలో పల్నాటి సబిత (35) విద్యుత్ షాక్‌తో శుక్రవారం మరణించారు. తాను నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి నీరు పడుతుండగా, విద్యుత్ మోటర్ ఆగిపోయింది. దానిని సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సబిత భర్త లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.

News December 26, 2025

SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.