News April 24, 2024

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

image

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఈ నెల 18న కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి శోభాయాత్రంలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద ప్రసంగంలో సింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News March 17, 2026

ఖమ్మం: మనస్తాపంతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

image

మనస్తాపంతో ఎలుకల మందు సేవించి ఓ పీజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన పి.శ్రీవిద్య కాకతీయ వర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్నారు. ఈ నెల 7న మధిరలో విషగుళికలు సేవించగా.. తొలుత ఖమ్మం ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2026

‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు: పొంగులేటి

image

TG: డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని, అద్దెకు ఇస్తున్న వారికి నోటీసులివ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మే 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, నోటీసులకు స్పందించకపోతే ఇళ్లను రద్దు చేయాలని సూచించారు. వాటిని అర్హులకు కేటాయించాలన్నారు. నోటీసులకు స్పందించిన వారితో తాము ఆ ఇంట్లోనే ఉంటామని, లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తామని బాండు పేపర్‌పై రాయించుకోవాలని పేర్కొన్నారు.

News March 17, 2026

బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.