News December 24, 2025
EV ఛార్జింగ్ స్లో అయిందా? కారణాలివే

EVలలో వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు టెంపరేచర్ సెన్సిటివ్‌గా ఉంటాయి. వింటర్లో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంట్ ఫ్లోకు ఎక్కువ టైమ్ పడుతుంది. అధునాతన EVల్లో వాతావరణంలో మార్పులను తట్టుకునేలా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు. బ్యాటరీ హెల్త్ కాపాడేందుకు ఛార్జింగ్ స్పీడ్, కెమికల్ రియాక్షన్స్‌ను తగ్గిస్తుంది. కొన్ని EVల్లో ఫాస్ట్ ఛార్జింగ్‌కు ముందు బ్యాటరీని ప్రీకండిషనింగ్ చేయొచ్చు.
Similar News
News December 27, 2025
ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ!

AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉన్న సందర్భంగా పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. మిగిలిపోయిన పెన్షన్లు జనవరి 2న పంపిణీ చేయాలని పేర్కొంది.
News December 27, 2025
చలికాలం.. పశువులకు నీటి విషయంలో నిర్లక్ష్యం వద్దు

చలికాలంలో నీటి కొరత పశువులకు పెద్ద సమస్యగా మారుతుంది. చాలా చోట్ల నీరు చాలా చల్లగా మారడం, చెరువులు, పంటకాలువల్లో సరైన నీటి లభ్యత లేకపోవడం వల్ల పశువులు తగినంత నీరు తీసుకోలేవు. ఒక పశువుకు రోజుకు అవసరమైన పరిమాణంలో నీటిని అందించకపోతే డీహైడ్రేషన్, కడుపునొప్పి, జీర్ణప్రక్రియలో సమస్యలు వస్తాయి. ఇది పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే చలికాలంలో పశువులకు రాత్రివేళ గోరువెచ్చని నీటిని అందించాలి.
News December 27, 2025
ఈ వస్తువులు దానం చేయకూడదు: పండితులు

పుణ్య కార్యాల్లో దానం అతి గొప్పది. అయితే కొన్ని దానాలు ఏ ఫలితాలను ఇవ్వవని పండితులు చెబుతున్నారు. ‘చీపురు దానమివ్వకూడదు. మిగిలిన ఆహారాన్ని దానం చేస్తే వారి కడుపు నిండుతుంది కానీ, ఆ ఫలం మీకు దక్కదు. గ్రహ దోషాలు ఉన్నవారు నూనె, స్టీల్ పాత్రలను ఎవరికీ ఇవ్వకూడదు. పదునైన వస్తువులు దానం చేస్తే విభేదాలు రావొచ్చు’ అంటున్నారు. మరి ఏ వస్తువు దానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


