News December 24, 2025
BREAKING: ఖమ్మం: పిల్లాడి ప్రాణం తీసిన పెన్సిల్..!

ఆ పసివాడు రోజూలానే పెన్సిల్‌ను జేబులో పెట్టుకున్నాడు. కానీ అదే పెన్సిల్ తన ప్రాణాలను తీస్తుందని ఊహించలేకపోయాడు. ఖమ్మం పరిధి కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న మేడారపు విహార్(6) బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దురదృష్టవశాత్తు జేబులోని పెన్సిల్ బలంగా ఛాతిలోకి గుచ్చుకోవడంతో ఆ చిన్నారి విలవిలలాడుతూ చనిపోయాడు.
Similar News
News December 28, 2025
రేపు శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News December 28, 2025
ప్రకాశం: ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్

గుంటూరు నగర శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఒంగోలు వైపునకు బయలుదేరారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్‌గా పోలీసులు గుర్తించారు. నల్లపాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
News December 28, 2025
రేపు ప్రజావాణి యథాతధం: ASF కలెక్టర్

ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం యథాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.


